ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే చిత్రం `అల్లుడు అదుర్స్ ` – ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ ఇంట‌ర్వ్యూ

0
470

`కందిరీగ` చిత్రంలో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ అందుకున్నారు ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `అల్లుడు అదుర్స్‌‌`. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభానటేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్‌ల‌లో విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ చెప్పిన విశేషాలు..

అలా మొద‌లైంది..
బెల్ల‌కొండ సాయి శ్రీ‌నివాస్ న‌టించిన `రాక్ష‌సుడు` మంచి విజ‌యం సాధించిన త‌ర్వాత ఒక రోజు బెల్ల‌కొండ సురేష్‌గారు పిలిచి ఏదైన మంచి క‌థ ఉంటే చెప్పు అన్నారు. అప్ప‌టికే నా ద‌గ్గ‌ర మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ స్క్రిప్ట్ సిధ్దంగా ఉండ‌డంతో న‌రేష‌న్ ఇచ్చాను. స్క్రిప్ట్ విన‌గానే సురేష్‌గారు ఎక్స‌లెంట్‌గా ఉంది, రాక్ష‌సుడు త‌ర్వాత సాయితో ఇలాంటి ఎంట‌ర్టైన్‌మెంట్ జోన‌ర్‌లోనే చేయాల‌ని చూస్తున్నాను.. త‌ప్ప‌కుండా మ‌నం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు.

అదే నిజమైంది.
అక్టోబ‌ర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2020 ఏప్రిల్‌30 రిలీజ్ అనుకున్నాం.`అల్లుడు అదుర్స్` టైటిల్ కూడా క‌న్‌ఫామ్ చేశాం. స‌రిగ్గా మూడు రోజుల్లోనే తెలంగాణ‌లో కూడా క‌రోనా వ‌చ్చింది. ఒక ప్ర‌క్క క‌రోనా భ‌యంతోనే కొన్నిరోజులు షూటింగ్ చేశాం… టాకీ పార్ట్ దాదాపు పూర్త‌య్యింది, అంత‌లో మార్చి23 లాక్‌డౌన్ మొద‌లైంది. ఎన్ని రోజులు ఉంటుందో ఎవ్వ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి అయితే నేను మాత్రం ఒక‌టే ఫిక్స్ అయ్యాను `అల్లుడు అదుర్స్` టైటిల్ పెట్టాం కాబ‌ట్టి త‌ప్ప‌కుండా పండ‌గ‌కు సినిమా వ‌స్తుంది అని` ఇప్పుడు అదే నిజమైంది.

ప్ర‌తి రోజు వ‌ర్క్ చేశాం.
ఈ క‌రోనా టైమ్‌లో కూడా సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయాల‌ని ప్ర‌తి రోజు సినిమా మీద వ‌ర్క్ చేశాం. లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటూ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, సాంగ్స్ షూట్ చేశాం. క‌రోనా త‌ర్వాత కూడా 40 రోజులు షూటింగ్ చేసిన మా సెట్లో ఒక్క‌రికి కూడా క‌రోనా రాలేదు.

సంక్రాంతి అనేది అల్లుల్ల పండుగ
క‌రోనా త‌రువాత ఇటీవ‌ల విడుద‌లైన సోలొ బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాకి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌డంతో మా అంద‌రికి ధైర్యం వచ్చింది. అలాగే సంక్రాంతి అనేది అల్లుల్ల పండుగ మ‌రోక‌టి ఏంటంటే అల్లుడు ఎలాంటివాడైనా అత్త‌మామ‌ల‌కు వాళ్ల అల్లుడు అదుర్సే అందుకే ఈ సంక్రాంతికి అదే టైటిల్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం.

హీరో క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంది
కందిరీగ ఫార్ములా కాదు కాని ఆ సినిమాలో ఉన్న‌ట్టే ఫ్యామిలీ ఎంట‌ర్టైన్‌మెంట్ ను ఎక్స్‌పెక్ట్ చేయోచ్చు. సినిమా చూసి ఫ్యామిలీ అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికెళ్తారు. ల‌వ్ అండ్ యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ అన్ని ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంటుంది. ఆ పాత్ర‌లో అంత‌ర్లీనంగా ఒక జెన్యూనిటి ఉంటుంది. ఆ జెన్యూనిటీనే ఈ క‌థ‌కి అడ్ర‌స్‌. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడే సాయికి బాలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాకి సాయి న‌ట‌నే హైలెట్‌. ఈ మూవీతో న‌టుడిగా త‌న‌ స్థాయి పెరుగుతుంది.

సోనుసూద్‌తో మంచి అనుబందం ఉంది.
సోనుసూద్‌తో నేను `కందిరీగ` సినిమా చేశాను. మా ఇద్ద‌రికీ మంచి అనుబందం ఉంది. అయితే ఈ క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న ధైర్యంగా ముందుకు వ‌చ్చి చేసిన మంచి ప‌నుల ద్వారా ఆడియ‌న్స్ పాయంట్ ఆఫ్ వ్యూలో హీరో అయ్యారు. మేం ఇక్క‌డ షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పిన మూడు రోజుల్లోనే ముంబైలో ఆ ప‌సుల‌న్ని చేయ‌డం స్టార్ట్ చేశాడు. క‌రోనా త‌ర్వాత సోనుసూద్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న పాత్ర‌లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయ‌డం జ‌రిగింది.

ఆడియోతో సినిమా రేంజ్ పెరిగింది.
దేవిశ్రీ ప్ర‌సాద్ గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ ఆడియో ఇచ్చారు. ఈ సినిమా రేంజ్ ఆయ‌న ఆడియోతో పెరిగింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఓలా చిక్కా సాంగ్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మిగతా పాట‌ల్ని విడుద‌ల‌చేయ‌బోతున్నాం. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను.

ఇద్ద‌రు హీరోయిన్స్ కి మంచి పేరు వ‌స్తుంది.
న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ ఇద్ద‌రు హీరోయిన్స్‌. న‌భా క్యారెక్ట‌ర్ ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా, ఫ‌న్నీగా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ అమ్మాయి. అలానే అను ఇమ్మాన్యుయేల్ పాత్ర చాలా సాఫ్ట్‌గా, హుందాగా ఉంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకువ‌స్తుంది.

స్ట్రాంగ్ ఎమోష‌న్ ఉంటుంది
ఈ సినిమాలో బెల్ల‌కొండ సాయి శ్రీ‌నివాస్ ఆర్కిటెక్ట్ గా క‌నిపిస్తారు. సినిమా అంతా ఫుల్ ఎన‌ర్జీతో ఉంటుంది. అయితే ఆడుతూ పాడుతూ అంద‌రితో స‌ర‌దాగా ఉండే ఒక క్యారెక్ట‌ర్లో ఒక స్ట్రాంగ్ ఎమోష‌న్ కూడా ఉంటుంది అదేంటి అనేది థియేట‌ర్‌ల‌లో చూడాల్సిందే..

అదే నా ప్ల‌స్ పాయంట్
బేసిక్‌గా నేను సినిమాటోగ్రాఫ‌ర్‌ని కాబ‌ట్టి సాదార‌ణంగా 150రోజుల్లో తీసే సినిమాని 110 రోజుల్లో కంప్లీట్ చేయ‌గ‌ల‌ను. అలాగే మ‌నం పెట్టిన బడ్జెట్‌కి స్క్రీన్‌మీద రెట్టింపు చూపించ‌గ‌ల‌ను. అదే నా ప్ల‌స్ పాయంట్‌. అది తెలుసు కాబ‌ట్టే ప్రొడ్యూస‌ర్స్ నాతో సినిమాలు చేస్తుంటారు. అలాగే ఆర్టిస్టుల‌కి ఫ్రీడ‌మ్ ఇచ్చివారితో వ‌ర్క్ చేయించుకోగ‌ల‌ను. అందుకే ఈ సినిమాలో సోనసూద్‌, ప్ర‌కాశ్ రాజ్‌, స‌ప్త‌గిరి, స‌త్య‌, చ‌మ్మ‌క్ చంద్రల‌తో వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో త‌ప్ప‌కుండా ఒక ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్‌ స‌బ్జెక్ట్‌తో సినిమా చేస్తా..అలాగే `కందిరీగ` చిత్రానికి సీక్వెల్ `కందిరీగ 2` ఐడియా రెడీగా ఉంది దాన్ని డెవ‌ల‌ప్ చేయ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్క‌ర్ష‌న్లో ఉన్నాయి.

అన్ని సినిమాలు విజ‌యం సాధించాలి
ఈ సంక్రాంతికి విడుద‌ల‌య్యే అన్ని సినిమాలు మంచి విజ‌యం సాధించి ఇండ‌స్ట్రీకి మంచి రెవెన్యూ వ‌స్తే ఫిబ్ర‌వ‌రిలో మ‌రికొన్ని మంచి సినిమాలు వ‌స్తాయి. అందుకే పండుగ‌కి రిలీజ‌య్యే అన్ని సినిమాలు విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here