స్వ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత శిరీష్

0
340

GMS gallery ఫిలిమ్స్ సంస్థలో జి ఎం సురేష్ గారు నిర్మిస్తున్న తొలి సినిమా ‘స్వ’ ఆనంతపురం, వైజాగ్, హైదరాబాద్ లల్లో షూటింగ్ పనులు ముగించుకుని షేడ్ స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నిన్న దిల్ రాజు గారి సోదరుడైన ప్రముఖ నిర్మాత శిరీష్ గారు టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భం లో దర్శకుడు మను గారు మాట్లాడుతూ సినిమా టైటిల్ ‘స్వ’ అంటూ అనౌన్స్ చేస్తూ సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చిందంటూ నిర్మాత సురేష్ గారికి ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో హీరో పాత్ర పోషించిన మహేష్ యడ్లపల్లి, సంగీత దర్శకులు కరణం శ్రీ రాఘవేంద్ర, నటుడు సిద్ధార్థ్ మరియు జానగని కార్తిక్ లు పాలుగొన్నారు. స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్, మానిక్ రెడ్డి, సిద్దార్థ్ ఇందులో ముఖ్య తారాగణంగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here