గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

0
55

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని కావున తన అభిమానులను; స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని పిలుపునివ్వడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here