సక్సెస్ వ‌చ్చేలోపు స్ట్రగులింగ్‌‌ డేస్‌ను ఎంజాయ్‌ చేయండి – డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌

0
324

సక్సెస్ అందరికీ వస్తుంది. కానీ అది వ‌చ్చేలోపు మీరు స్ట్రగులింగ్‌‌ డేస్‌ని ఎంజాయ్‌ చేయండి” అని అంటున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌.

పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ఈ రోజు ‘స్ట్రగులింగ్‌ డేస్‌’ గురించి మాట్లాడుతూ “అబ్రహం లింకన్‌ చాలా పేద కుంటుంబంలో పుట్టాడు. డబ్బుల్లేక కేవ‌లం ఒక‌ సంవత్సరం మాత్రమే స్కూలుకెళ్లాడంట‌. అంబేద్కర్‌ ఇంకా పేద కుటుంబంలో పుట్టాడు. వీధి దీపాల కింద చదువుకునేవాడు. స్టీవ్‌ జాబ్స్ కి తినడానికి తిండి లేక రోజూ నడుచుకుంటూ వెళ్లి హారే రామ హరే కృష్ణ లో తినేవాడు. మనందరికీ ఇలాంటి స్ట్రగులింగ్‌ డేస్‌ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు కూడా వస్తాయి. అవి తలుచుకుంటే చాలా భాద అనిపిస్త‌ది. మనకెప్పుడు సక్సెస్‌ వస్తుందా? అని ఎదురుచూస్తుంటాం. ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నది అయిపోతుంది చూడు… అప్పుడు నిజ‌మైన కష్టాలు మొదలవుతాయి. సక్సెస్ వ‌చ్చినాకే అసలైన స్ట్రగులింగ్ డేస్‌ మొదలవుతాయి. ఎంప్లాయ్‌గా ఉన్న‌ప్పుడు హ్యాపీ..కంపెనీ పెట్టిచూడు దూల‌తీరిపోద్ది..అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ ‘స్ట్రగులింగ్‌ డేస్‌’ గురించి పూరీ చెప్పిన మరిన్ని విశేషాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here