కృష్ణతో అనుబంధం మరింత పెంచిన చిత్రం ‘మనుషులు చేసిన దొంగలు`‌. – రెబల్‌స్టార్ కృష్ణంరాజు

0
400

సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రం ‘మనుషులు చేసిన దొంగలు`‌. 1977 అక్టోబర్‌ 19న విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా రిలీజై నేటికి 43 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయాన్ని కృష్ణంరాజు తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. “మనుషులు చేసిన దొంగలు’ చిత్రం విడుదలై 43 ఏళ్లవుతుంది. కృష్ణతో నా బంధం మరింతగా బలపడటానికి ఈ సినిమా ఎన్నో మధురమైన అనుభూతులను మిగిల్చింది” అంటూ సినిమా పోస్టర్‌ను షేర్‌ చేశారు కృష్ణంరాజు. కృష్ణ సమర్పణలో శ్రీ పద్మావతీ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వంలో యు. సూర్యనారాయణ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ పెద్ద తనయుడు రమేశ్‌బాబు ఇందులో బాలనటుడిగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here