మలయాళం సూప‌ర్ హిట్ మూవీ ‘ప్రతి పూవంకోళి’ ఆల్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ రైట్స్ సొంతం చేసుకున్న‌ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ ‌బోనీ క‌పూర్‌.

0
46

బాలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా వైజ్‌గా చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నబాలీవుడ్ ఫిలిం మేక‌ర్ ‌బోనీ క‌పూర్‌
మరో సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రతి పూవంకోళి’ సినిమాను అన్ని భారతీయ భాషల్లో నిర్మించేందుకు రీమేక్, డబ్బింగ్ రైట్స్‌ను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు.

‘ప్రతి పూవంకోళి’ చిత్రం 2019 డిసెంబర్ 20న మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మంజు వారియర్‌ నటించిన ఈ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ఉన్ని ఆర్ రచించారు. ‘సంకడం’ కథా ఆధారంగా ఈ సినిమాను రోషన్‌ ఆండ్సూస్‌ రూపొందించ‌డంతో పాటు ఆ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకునే ఒక సేల్స్ ఉమెన్ పాత్రలో మంజు వారియర్ న‌ట‌న‌కు ప‌లువురి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో బోనీ కపూర్ రీమేక్ చేయనున్నారు. మరికొన్ని భాషల్లో అనువదించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు నిర్మాత‌ బోనీ కపూర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here