ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ

0
68

తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here