ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న యువ‌రాజా నిఖిల్ కుమార్, కొండా విజయ్ కుమార్ ల‌ `రైడ‌ర్‌`

0
120

భార‌త మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవ‌గౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రం `రైడ‌ర్‌`. గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా పాపుల‌ర్ మ్యూజిక్ కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ అధినేత చంద్రు మ‌నోహ‌ర‌న్‌ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సెప్టెంబ‌ర్ 11 సాయంత్రం 7గంట‌ల‌కు ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌లో శ‌త్రువుల‌ను చిత‌క‌బాద‌డానికి ప‌రిగెత్తుకుంటూ వ‌స్తోన్న నిఖిల్ మాస్‌లుక్ అంద‌రికీ ఆక‌ట్టుకుంటోంది. అర్జున్ జ‌న్యా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

నిఖిల్ కుమార్ స‌ర‌స‌న హీరోయిన్‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

యువ‌రాజా నిఖిల్ కుమార్‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్‌, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కె.ఆర్‌. పీట్‌, నిహారిక‌, సంప‌ద హుళివ‌న‌, అనూష త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
ర‌చ‌న‌: న‌ంద్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాష్‌, డైలాగ్స్‌, కో-డైరెక్ట‌ర్‌: శ‌ర‌త్ చ‌క్ర‌వ‌ర్తి,మ్యూజిక్‌: అర్జున్ జ‌న్యా,సినిమాటోగ్ర‌ఫీ: శ్రీ‌ష ఎం. కుడువ‌ల్లి, ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌, స్టంట్స్‌: డాక్ట‌ర్ ర‌వివ‌ర్మ,‌ ఆర్ట్‌: మోహ‌న్ బి. కెరే, క్రియేటివ్ హెడ్‌: సునీల్ గౌడ, నిర్మాత‌: చ‌ంద్రు మ‌నోహ‌ర‌న్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here