మా అనుబంధం ఎంతో విశిష్టమైనది

0
782

జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళు గా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. మా ఇద్దరి మధ్యా ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

– నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here