జిమ్ ట్రైన‌ర్‌కు ఖ‌రీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

0
479
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అంటే స‌మ్‌థింగ్ స్పెష‌ల్. ఇండ‌స్ట్రీలో అంద‌రికీ డార్లింగ్ అత‌డు. ఇండ‌స్ట్రీలోనే కాదు బ‌య‌ట కూడా. ప్ర‌భాస్ స్టైల్, న‌ట‌న‌తో పాటు క‌ల్మ‌షం లేని అత‌ని మ‌న‌సుకు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ప‌్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాలు అన్నీ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం `రాధేశ్యామ్` చిత్రంతో పాటు నాగ్ అశ్విన్ చిత్రం, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

ఇక‌ ప్రభాస్‌కి కొన్ని మంచి అల‌వాట్లు ఉన్నాయి. త‌న మిత్రుల‌కు, స‌న్నిహితుల‌కు, అతిథుల‌కు క‌డుపునిండా అన్నం పెట్ట‌డం…కాస్ట్లీ గిఫ్టులు ఇవ్వ‌డం. అందులో భాగంగా త‌న శ‌రీర సౌష్ట‌వాన్ని చ‌క్క‌గా మ‌లిచి అభిమానులకి ఆరాధ్య దైవంగా మార్చిన జిమ్ ట్రైన‌ర్ ల‌క్ష్మ‌ణ్ రెడ్డికి ప్ర‌భాస్ ఖ‌రీదైన‌ రేంజ్ రోవ‌ర్ బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఆ కారుని చూసిన‌ ల‌క్ష్మ‌ణ్ రెడ్డి ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందం వ్య‌క్తం చేశార‌ట‌.
ఫ్యూర్ హార్ట్ తో డార్లింగ్ చేసిన ఈ మంచి ప‌నికి ఆయ‌న అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జిమ్ ట్రైన‌ర్‌కు గిఫ్ట్ గా ఇచ్చిన కారుతో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ దిగిన ఫోటో చ‌క్క‌ర్లు కొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here