వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను – మ‌హేష్‌బాబు

0
352
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా

జీవితంలో తనకు స్ఫూర్తిగా నిలిచిన వారికి, విద్య నేర్పినవారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు విద్య నేర్పిన గురువులకు మహేష్ బాబు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

`కొత్త విషయాలు నేర్చుకోవడానికి హ‌ద్దులంటూ ఏమీ ఉండ‌వు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి మార్గనిర్ధేశం చేస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నాకు స్ఫూర్తిగా నిలిచినవారికి, విద్య నేర్పిన వారికి, నాకు మార్గదర్శనం చేసిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్ డే` అని ట్వీట్ చేశారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here