అలనాటి అందాల‌ తార జమునకు ‘భానుమతీ రామకృష్ణ జాతీయ పురస్కారం’

0
83
అలనాటి అందాల‌ తార జమునకు ‘భానుమతీ రామకృష్ణ జాతీయ పురస్కారం’

అలనాటి అందాల‌ తార జమున ‘భానుమతీరామకృష్ణ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్’ సంయుక్త నిర్వహణలో బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ 96వ జయంతి సందర్భంగా ఈ నెల 7వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న వర్చువల్‌ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జమునకు అందజేయనున్నారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భానుమతి, జమున నటించిన, పాడిన పాటలను భారత్, సింగపూర్, అమెరికా దేశాల నుంచి పలువురు ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here