మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిది. వారి ఆలోచనలు, త్యాగాల ఫలితంగా మనకు ఈ విలువైన స్వాతంత్య్రం లభించింది’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో మెగాస్టార్ నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.



