మహేష్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన విజయ్

0
205
Mahesh Babu Vijay

గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి తన పుట్టిన రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన దళపతి విజయ్ ఈ రోజు చెన్నై లోని తన నివాసం లో మొక్కలు నాటారు. విజయ్ మొక్కలు నాటే ఫోటోలు పోస్ట్ చేస్తూ, మహేష్ గారు ఇది మీ కోసం, అందరి ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం అంటూ ట్వీట్ చేయగా మహేష్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించినందుకు థాంక్స్ బ్రదర్ అంటూ విజయ్ కి రిప్లై ఇచ్చారు.

ఈ సందర్బంగా దళపతి విజయ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం , ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం లో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారు , ఇతర దేశాలతో పోల్చితే మనదేశం లో ఒక్క మనిషి కావాల్సిన మొక్కలు చాలా తక్కువ వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు , అందువల్ల దేశ రాజధాని లో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడం లో అశ్రద్ధ చూపుతున్నాం అనడానికి నిదర్శనం . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు , మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం , ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం , మొక్కలు నాటడం పైన , పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది . అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here