సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట` టైటిల్ ప్రకటిస్తూ ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.. ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ అభిమానులను హుషారెత్తించే `సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి బర్త్‌డే విషెస్ తెలిపారు నిర్మాతలు.
`సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ లో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ప్రీ లుక్‌లో కనిపించిన మహేశ్.. ఇప్పుడు మోషన్ పోస్టర్లో ఆ కాయిన్ టాస్ చేస్తూ కనిపించారు. సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్లో థమన్ మ్యూజిక్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ – “ నా బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. `సర్కారు వారి పాట’ స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఒక కంప్లీట్ ఎంటర్టైనర్“ అన్నారు.
దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ – ” సూపర్ స్టార్ మహేశ్ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల `సర్కారు వారి పాట` నెరవేరింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ని విడుదలచేయడం ఆనందంగా ఉంది.” అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ – ” సూపర్ స్టార్ మహేశ్ గారితో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.” అన్నారు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: మధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
సంగీతం: థమన్ ఎస్.ఎస్,
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Hungama Shuru 💥
Here's the electrifying Motion Poster of #SarkaruVaariPaata 🔔https://t.co/hI9QiSnYQv#HBDMaheshBabu 💝Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2020
Hungama Shuru 💥
Here's the electrifying Motion Poster of #SarkaruVaariPaata 🔔https://t.co/JBNOLYhBcn#HBDMaheshBabuSuper ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @MythriOfficial @14ReelsPlus @GMBents
— GMB Entertainment (@GMBents) August 9, 2020
Hungama Shuru 💥
Here's the electrifying Motion Poster of #SarkaruVaariPaata 🔔https://t.co/GrBufs6wCq#HBDMaheshBabuSuper ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents
— 14 Reels Plus (@14ReelsPlus) August 9, 2020
Here is Superstar's Birthday special from team #SarkaruVaariPaata 🔔🥁 https://t.co/ITdb6pbTHI #HBDMaheshBabu
Super ⭐ @urstrulyMahesh @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus— Parasuram Petla (@ParasuramPetla) August 9, 2020