`రెడీ` అంటూ బాంబు పేల్చిన రానా..

0
395
దగ్గుబాటి ఫ్యామిలీలో పండుగ‌ వాతావరణం

దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రానా- మిహీక జోడీ ఒక్కటి కానున్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీలో పండుగ‌ వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తన బాబాయ్, తండ్రితో కలిసి దిగిన ఓ లేటెస్ట్ పిక్ షేర్ చేసి సింపుల్ కామెంట్‌తో అట్రాక్ట్ చేశారు పెళ్లి కొడుకు రానా.

సాంప్రదాయ దుస్తుల్లో బాబాయ్ వెంకటేష్, తండ్రి సురేష్ బాబుతో హుషారుగా ఓ ఫొటోకు పోజిచ్చిన రానా.. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ”రెడీ” అనే కాప్షన్ ఇచ్చి బాంబ్స్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో సురేష్ బాబు, వెంకటేష్, రానా ముగ్గురినీ అలా ఒకేచోట దగ్గుబాటి ఫ్యామిలీలో పండుగ‌ వాతావరణం చూసిన ఫ్యాన్స్  తెగ మురిసిపోతూ రానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here