కరోనా విజేతలతో అవగాహన కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ ను నామినేట్ చేసిన హీరో నాగ చైతన్య

0
56
యువ కథానాయకుడు నాగచైతన్య

కరోనాతో పోరాటంలో విజేతలుగా నిలిచిన వారి అనుభవాలను ప్రజలకు వివరించే అవగాహన కార్యక్రమంలో భాగంగా యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య దర్శకుడు సుకుమార్ ను నామినేట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుపెట్టిన ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని సుకుమార్ ను కోరారు.

కరోనా వైరస్ భారినపడిన సామాన్యులు వైరస్ ను ఎలా ఎదుర్కొని విజేతలుగా నిలిచారనే విషయంపై శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ వేదికగా ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తర్వాత చైతన్యను నామినేట్ చేశారు. అందులో భాగంగా నాగచైతన్య కూడా పలువురు కొవిడ్ విజేతలో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం మరికొంత మంది విజేతల అనుభవాలను తెలుసుకోవడానికి ఈ ప్రయత్నంలో తదుపరి వ్యక్తిగా సుకుమార్ ను నామినేట్ చేస్తున్నట్లు చైతన్య తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here