21 సంవత్సరాల రాజకుమారుడు

0
726
'రాజకుమారుడు'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు’ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో మెగామేకర్ సి అశ్వినీదత్ వైజయంతి బ్యానర్ లో నిర్మించారు. ఫస్ట్ డే షూటింగ్ ‘గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది…’ సాంగ్ లోని షాట్ ను మహేష్ బాబు, ప్రీతీ జింతా ల పై రామానాయుడు, జూబిలీ హిల్స్ స్టూడియో లో వేసిన సెట్ లో తీశారు కేఆర్ఆర్. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారు సెట్ కి విచ్చేశారు. రాజు సుందరం ఈ పాటకు కోరియోగ్రఫీ చేశారు. ఈ షాట్ తో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ స్టార్ట్ అయింది.

1999, జూలై 30న విడుదలైన రాజకుమారుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా మహేష్ ను సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చింది. దర్శకేంద్రుడి కెరీర్ లో వైజయంతి బ్యానర్ లో మెమొరబుల్ హిట్ గా నిలబడింది. ‘రాజకుమారుడు’ ఈ రోజుతో 21 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాదు, హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు 21 సూపర్ సక్సెసఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here