యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా..` పాట‌లు విడుద‌ల‌

0
550
Raj Tarun's 'Orey Bujjiga'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచ‌నాల‌ను పెంచిన విష‌యం తెలిసిందే..యూత్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కిన ఒరేయ్‌ బుజ్జిగా సినిమాలోని పాట‌లు ఈ మూవీకి మ‌రింత క్రేజ్‌ను సంపాదించిపెట్టాయి. ఒరేయ్‌ బుజ్జిగా చిత్రంలోని ఒక్కో పాట‌లు ను విడుద‌ల చేస్తూ హైప్ తీసుకువ‌చ్చిన చిత్ర యూనిట్ ఈ రోజు జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాట‌ల‌ను విడుద‌ల‌ చేసింది. అనూప్ రూబెన్స్ స్వ‌ర ప‌రిచిన అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా..

ఈ మాయ పేరేమిటో.. ఏమిటో.. అంటూ హూశారుగా సాగే ఈ పాట‌ని లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ పాడారు. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్ర‌గడ సాహిత్యం అందించారు. కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ కె.కె రాసిన ఈ పాట‌ను అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆలపించి వీనుల విందు కలిగించారు. కృష్ణ‌వేణి ..కృష్ణ‌వేణి అంటూ రాహుల్ సిప్లిగంజ్ త‌న‌దైన శైలిలో పాడిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాశారు. `స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా,,ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా` అంటూ హుశారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ గానం చేశారు. క‌ల‌లు చూసినా క‌న్నులే నేడు మోసెనే క‌న్నీల్లే… హాయి పంచినా గుండెకే ఓ గాయ‌మ‌య్యెనే..అంటూ అర్ద‌వంతంగా మ‌న‌సుకు హ‌త్తుకునే ఈ విర‌హ‌గీతాన్ని కాస‌ర్ల శ్యామ్ రాయ‌గా లేటెస్ట్ సింగింగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ అంతే అద్భుతంగా ఆల‌పించారు. ఈ సినిమాలోని పాట‌లు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుల‌య్యాయి.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here