నటసింహం నందమూరి బాలకృష్ణ హీరో గా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెలుగు తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తాలూకు ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను సంపాదించడం జరిగింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మితమవుతున్న NBK 105 సినిమాలో హీరోయిన్ గా పలువురి పేర్లు కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండటంతో,
నేడు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ విషయమై మాట్లాడుతూ, NBK 105 సినిమాలో బాలకృష్ణ గారికి జోడిగా ఒక సరికొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని, అలానే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కుతోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు……!!



