ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ కన్నుమూత

0
433
Bollywood Veteran Choreographer Saroj Khan Passes Away

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) నేడు (జూలై 3) న ముంబై లోని హాస్పిటల్ లో కన్నుమూశారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆవిడను కొన్నాళ్ల క్రితం కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయగా కరోనా పరీక్షల్లో ఆవిడకు నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనుకోకుండా వచ్చిన గుండెపోటు తో ఆవిడ మృతి చెందారు.

సరోజ్ ఖాన్ తన 3వ యేటనే బల నటిగా సినిమాల్లోకి ప్రవేశించారు. తర్వాత బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేశారు. అంచలంచెలుగా ఎదిగి ప్రముఖ నృత్య దర్శకురాలిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ ల ఎన్నో సూపర్ హిట్ గీతాలకు సరోజ్ ఖాన్ డాన్స్ కంపోజ్ చేశారు. అందరూ గౌరవంగా మాస్టర్ జీ అని పిలుచుకునే సరోజ్ ఖాన్ 3 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తెలుగు, తమిళ ఇతర భాషల్లో కూడా ఆవిడ పని చేశారు. బాలీవుడ్ ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతితో సినీ పరిశ్రమ ఒక అత్యుత్తమ నృత్య దర్శకురాలిని కోల్పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here