బాలీవుడ్ హీరో ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ ఆత్మహత్య……!!

0
750
Sushant Singh Rajput Passes Away

ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నేడు మధ్యాహ్నం తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు కాసేపటి క్రితం ముంబై పోలీసులు తెలిపారు. ముందుగా బుల్లితెరపై మెరిసిన సుశాంత్, ఆ తరువాత బాలీవుడ్ చిత్ర సీమ లో హీరోగా అడుగుపెట్టి ప్రస్తుతం మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్నారు. భారత క్రికెటర్ ఎమ్ ఎస్ ధోని బయోపిక్ గా తెరకెక్కిన ‘ధోని’ ది అన్ టోల్డ్ స్టోరీ మూవీలో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సుశాంత్, ఆ పై చిచ్చోరె, కై పోచే, డిటెక్టివ్ బ్యోమ్ కేష్ బక్షి, రాబ్తా, వెల్కమ్ న్యూయార్క్, కేదార్నాధ్, డ్రైవ్, సొంచరియా తదితర చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దిల్ బేచరా’ సినిమా షూటింగ్ దశలో ఉండగా, కరోనా కారణంగా దానిని నిలుపుదల చేసారు. కాగా ఈవిధంగా హఠాత్తుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అతి త్వరలో దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తాం అని ముంబై పోలీసులు చెప్తున్నారు. ఇక సుశాంత్ హఠాన్మరణ వార్త విన్న బాలీవుడ్ సహా పలు ఇతర భాషల నటులు, ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనవుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు……!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here