సలామ్‌… డా!! అబ్దుల్‌ కలామ్‌ గారు !

0
80
june 10 2006 will be memorable day for Chiranjeevi Blood Bank

జూన్‌ 10… చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ చరిత్రలో సువర్ణాక్షరాల్తో లిఖించదగ్గ రోజు. 2006 జూన్‌ 10 న బ్లడ్‌బ్యాంక్‌కి ఓ విశిష్ట అతిథి విచ్చేసిన రోజు.

ఆరోజు అప్పటి రాష్ట్రపతి మాన్యశ్రీ అబ్దుల్‌ కలామ్‌ గారు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ కి విచ్చేసి… అసమానరీతిలో బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న తీరును పరిశీలించి ముచ్చటపడ్డారు.

ఇంతటి బృహత్తర యజ్ఞాన్ని చేపట్టిన మెగాస్టార్‌ శ్రీ చిరంజీవిగారిని మన:పూర్వకంగా అభినందించారు.

పనిలో పనిగా…బ్లడ్‌ బ్యాంక్‌ పురోగతిలో ఉడతాభక్తితో పాలుపంచుకుంటున్న రక్తదాతలను కూడా ఆయన ప్రోత్సహించడం పూర్వజన్మ సుకృతం.

‘రక్తదాతలు’ “దేవుళ్ళ”తో సమానమని రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు ప్రత్యేకంగా కొనియాడారు.

శ్రీ అబ్దుల్‌ కలాం గారు అందించిన ఆనాటి స్ఫూర్తి ఇప్పటికీ మా అందర్నీ ముందుకు నడిపిస్తోంది.

జై చిరంజీవ… జైజై చిరంజీవ…

రవణం స్వామినాయుడు,
చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here