ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఎల్లుండి 60వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్లు, ఆయన జీవితం, సినీ కెరీర్ విశేషాలు. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారితో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి అంటూ ఆయనతో వర్క్ చేయడంపై పలు విషయాలు వెల్లడించిన ప్రముఖ నిర్మాత సి అశ్వినిదత్. సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ ల కలయికలో రూపొందనున్న సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమా విశేషాలు వెల్లడించిన మహేష్ బాబు. తన 85వ జయంతి సందర్భంగా నిర్మాతలకు ఆదర్శప్రాయుడు, చిరస్మరణీయుడు, మూవీ మొఘల్ డి రామానాయుడు జీవిత విశేషాలు. విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ లో సుందరమ్మ గా, విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క గా నటిస్తున్న ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఆ సినిమాల విశేషాలు. ‘జుంబారే జుజుంబరే’ పాటతో సూపర్ స్టార్ కృష్ణకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మనవడు అశోక్ గల్లా.
యువ దర్శకుడు బి శివ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ’22’ లో హీరోయిన్ గా నటిస్తున్న సలోని మిశ్రా బర్త్ డే సందర్భంగా ఆ సినిమా విశేషాలు. సినీ పరిశ్రమ విషయంలో కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారంటున్న టిఆర్ఎస్ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించిన విశేషాలు. కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కు రారు అనేది అపోహ మాత్రమే అంటున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా చెప్పిన విషయాలు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో తన దయార్ద్ర హృదయంతో 10 వేల మందికి నిత్యావసరాలు అందించిన నటుడు జగపతి బాబు. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ఏకంగా 150మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సక్సెస్ సందర్భంగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా విశేషాలతో పాటు పలు ఇతర లేటెస్ట్ మూవీ విశేషాలు, పోస్టర్లతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!