‘సర్కారు వారి పాట’ లో అందరినీ ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ మాస్ లుక్

0
582
Superstar Mahesh #SSMB27 Titled As Sarkaru Varri Paata

ప్రతీ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినాన సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేస్తారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ ను అన్నౌన్స్ చేశారు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూ తో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

‘సర్కారు వారి పాట’ ను అన్నౌన్స్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్, ” మరో హ్యాట్రిక్ కు ఇది బ్లాక్ బస్టర్ స్టార్ట్” అన్నారు

దర్శకుడు పరశురామ్, ” సూపర్ స్టార్ మహేష్ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల నెరవేరింది. దీని కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళదామా అని ఉంది.” అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ” సూపర్ స్టార్ మహేష్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయనతో 7 సంవత్సరాల తర్వాత కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.” అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ “సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అన్నౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది.” అన్నారు

డి ఓ పి : పీఎస్ వినోద్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్
సంగీతం : థమన్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం : పరశురామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here