మావయ్య రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు : సూపర్ స్టార్ మహేష్…..!!

0
390
Happy Birthday Mamayya, Superstar Mahesh Wishes Darsakendrudu

నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు గారికి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ కి చెందిన అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ కాసేపటి క్రితం ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రాఘవేంద్ర రావు కి విషెస్ ని తెలియచేసారు.

‘మీ వంటి గొప్ప దర్శకునితో కలిసి పనిచేసిన అనుభవాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను, మీరు రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ మహేష్ తన పోస్ట్ లో తెలిపారు. కాగా మహేష్ బాబు తొలిసారి హీరోగా పరిచయమైన రాజకుమారుడు సినిమాకు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు, తొలి సినిమాతోనే ఆయనకు సూపర్ డూపర్ హిట్ రూపంలో మంచి సక్సెస్ ని అందించడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here