మే 20న పుట్టిన రోజు జరుపుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎందరో ఇబ్బంది పడుతున్న సమయంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని, వలస కూలీలు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరేలా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నానని మంచు మనోజ్ ఒక పోస్ట్ పెట్టారు. దీనికి అందరి సహకారం కావాలని పిలుపునిచ్చారు.




