ఈ వారం ”సూపర్ హిట్” ఈ మ్యాగజైన్ హైలైట్స్ విశేషాలు. ఈ నెల 20న టాలీవుడ్ ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్‘ పుట్టిన రోజు సందర్భంగా కవర్ పేజీతో పాటు ఇన్నేళ్ల ఆయన సినీ జీవిత విశేషాలు. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా కొత్త దర్శకుడు బి. శివ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ’22’ మూవీ ప్రత్యేక బ్లోఅప్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి క్లాసిక్ లో నటించడంతో తన జన్మ ధన్యం అయిందంటూ మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వినిదత్, దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు పంచుకున్న ఆ సినిమా విశేషాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇటీవల సక్సెస్ఫుల్ గా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఆ సినిమాతో పాటు, తదుపరి పవర్ స్టార్ చేయబోయే సినిమా గురించి చెప్పిన ఆసక్తికర విశేషాలు. 15 ఏళ్ళ సినిమా కెరీర్ లో నాకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ తన సినీ కెరీర్ గురించి మాస్ సినిమాల దర్శకడు ‘బోయపాటి శ్రీను’ తెలిపిన పలు విషయాలతో పాటు ఆయన సినిమాల ప్రత్యేక పోస్టర్.
ఇటీవల లవ్ లో సక్సెస్ అయిన యువ జంట, రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ల వివాహం ఈ ఏడాదే చేయనున్నట్లు నిర్మాత సురేష్ బాబు వారి పెళ్లి గురించి తెలిపిన కొన్ని విషయాలు. అదే మీరు నాకు ఇచ్చే అసలైన పుట్టినరోజు కానుక అంటున్న ‘యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్’, నేడు బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆయన సినిమా కెరీర్ విశేషాలతో పాటు ప్రత్యేక పోస్టర్. హీరో రాజ్ తరుణ్, దర్శకుడు విజయ్ కుమార్ కొండా ల లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ లేటెస్ట్ పోస్టర్. బంధువుల సమక్షంలో ఎంతో నిరాడంబరంగా ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ వివాహ ఫోటోలు మరియు విశేషాలు. క్రీడా నేపథ్యంలో కమర్షియల్ గా రూపొందుతున్న ‘సీటిమార్’ అంటూ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ ఆ సినిమా గురించి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు. బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరిగిన యువ హీరో ‘నిఖిల్ సిద్దార్ధ’ వివాహ ఫోటోలు మరియు విశేషాలు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న యువ నటుడు సుధీర్ బాబు ‘వి’ మూవీ ప్రత్యేక పోస్టర్ తో పాటు, ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశాలు మా సినిమాలో చాలా ఉన్నాయంటూ ఆ సినిమా గురించిన పలు సంగతులు పంచుకున్న యువ హీరో సుధీర్ బాబు. అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ లో క్రైమ్ డిటెక్టీవ్ పోలీస్ ఆఫీసర్ ‘మహా’ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ అంజలి ప్రత్యేక పోస్టర్ తో పాటు, ఆ సినిమా డిఫరెంట్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆలరిస్తుందంటూ ఆమె తెలిపిన పలు విషయాలు.
‘నీకన్ను నీలి సముద్రం’ లిరికల్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో 50 మిలియన్ల అందుకున్న సందర్భంగా ‘ఉప్పెన’ మూవీ యువ జంట పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల లేటెస్ట్ ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆ సినిమా విశేషాలు. ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ప్రత్యేక పోస్టర్. కరోనా నివారణకు లలిత జెవెల్లరీ అధినేత భారీ విరాళం, సీనియర్ నటులు రావి కొండలరావు కు నిర్మాత చదలవాడ ఆర్ధిక సాయం, ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో రాజ్ తరుణ్ గురించిన విశేషాలు, థియేటర్ ఉద్యోగులకు నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి సపోర్ట్, తెలుగు వారికి సాయం చేసిన రాఘవ లారెన్స్, ట్రాన్స్ జెండర్స్ కు దర్శకుడు శేఖర్ కమ్ముల చేయూత, ఓ ఇంటివాడైన నటుడు రంగస్థలం మహేష్, వంటి పలు వార్తల సమాహారంతో కూడిన ఈ వారం ”సూపర్ హిట్” సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు టాలీవుడ్ సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!