మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్……!!

0
1255
Superhit Magazine this week Highlights

సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్.

తెలుగు జాతికే గర్వకారణమైన యోధుడు గా అల్లూరి గా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సక్సెస్ఫుల్ గా 46 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కవర్ పేజి మరియు ఆ సినిమా విశేషాలు. రూపేష్ హీరోగా మా ఆయీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 22 మూవీ లేటెస్ట్ పోస్టర్. సినీ పరిశ్రమ అతి త్వరలోనే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, అలానే తన మనవరాలితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చెప్పిన విశేషాలు. ఏప్రిల్ 28 నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు అంటున్న దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు చెప్పిన విశేషాలు. బ్లాక్ బస్టర్ ‘ఘరానా బుల్లోడు’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలు. అనుష్క శెట్టి, మాధవన్ కలిసి నటిస్తూ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నిశ్శబ్దం’ సినిమా స్పెషల్ పోస్టర్. మనందరం బాధ్యత గల పౌరులుగా మెలగాలని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు నిత్యావసరాల పంపిణీ చేసిన బాలకృష్ణ. వెంకటేష్, త్రిష కలిసి నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సక్సెస్ ఫుల్ గా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు. యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జి’ గా ప్రత్యేక పోస్టర్. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మాతగా కైకాల సత్యనారాయణ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘ఘటోత్కచుడు’ సక్సెస్ఫుల్ గా 25 ఏళ్ళు చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించిన విశేషాలు. కరోనా పై పోరుకు టాలీవుడ్ ప్రముఖులు అందించిన విరాళాలు, వాటి వివరాలు. ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ లో భాగంగా పాల్గొన్న టాలీవుడ్ తారలు వారి వివరాలు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఎప్పుడూ రాకూడదంటున్న సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వెల్లడించిన సంగతులు. సేవా కార్యక్రమాల్లో యువ హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు దాని గురించిన వివరాలు. అందరూ బాధ్యతగా కరోనా మహమ్మారి పై పోరాటం చేయాలి అంటున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉండే సినిమా మా ఈ ‘చావు కబురు చల్లగా’ అంటూ దర్శక నిర్మాతలు సినిమా గురించి చెప్పిన విశేషాలు. ప్రముఖ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీకపూర్ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువ నటుడు సందీప్ కిషన్ స్పెషల్ పోస్టర్. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ‘ఉప్పెన’ ప్రత్యేక పోస్టల్ తో పాటు, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహా’ సక్సెస్ఫుల్ గా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పేజీలతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల ఈ వారం హైలైట్స్ తెలుసుకోండి….!!

http://superhit.industryhit.com/t/28499

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here