టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో‘. ఈ సినిమాతో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ఎంతటి గొప్ప విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ఒక్కో పాటను ఒక్కో చార్ట్ బస్టర్ లా స్వరపరిచిన తీరుకి శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. కొద్దిరోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సాంగ్స్ లోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్ కి ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దంపతులు డాన్స్ చేయడం జరిగింది.
కాసేపటి క్రితం ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు వార్నర్. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది……!!
Butta bomma breaks the border @davidwarner31 dancing for #ButtaBomma Song #AlaVaikuntapurramuloo@alluarjun @MusicThaman @Trivikramin@GeethaArts @IamEluruSreenu @haarikahassine pic.twitter.com/UOGtXTh77n
— IndustryHit.Com (@industry_hit) April 30, 2020



