లాక్ డౌన్ వలన రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సినీ వర్కర్స్ ఛారిటీ కోసం 25 లక్షలు ప్రకటించారు. ఇంతకుముందే కరోనా నిర్మూలన చర్యల కోసం తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీ ఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీఎమ్ సహాయ నిధికి) విరాళంగా అందించారు. ఇవాళ సినీ వర్కర్స్ ఛారిటీ కోసం మహేష్ బాబు ప్రకటించిన 25 లక్షల రూపాయల విరాళం తో మహేష్ బాబు కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.



