తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా షూటింగ్స్ నిలిపివేస్తూ ప్రకటన !!!

0
792
Telugu Film Industry Shutting down

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ లు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ట గుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారాయన దాస్ నారగ్ మాట్లాడుతూ…
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ & మా సంయుక్తంగా చిత్రీకరణ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బంది ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవని తెలిపారు.

ఆర్టిస్ట్ బెనర్జీ మాట్లాడుతూ…
కరోనా చాలా భయంకరమైన వ్యాధి కావున తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్ తో పాటు, షూటింగ్ కూడా నిలిపివేయలనేది మా నిర్ణయంగా భావుస్తున్నాం. తెలంగాణ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాము, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ…
సోషల్ రెస్పాన్సిబులిటీ తో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరూ కలిసి దీన్ని సమర్ధిస్తున్నాము. షూటింగ్స్ సమయంలో వందల మంది పాల్గొంటారు వారి ఆరోగ్య దృస్థ్య ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…
ఎంతోమంది ప్రాణాలతో కూడిన సమస్య కావున షూటింగ్స్ ఆపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం మళ్ళీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలిపితే ఆ రోజు నుండి చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలు అందరూ స్వాగతించాలి. అందరి మంచి కోరి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉండాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here