అనుష్క 15ఏళ్ళ సినీ లైఫ్ పై ‘నిశ్శబ్దం’ టీమ్ స్పెషల్ ఈవెంట్…!!

0
751
Anushka 15 years

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదట కింగ్ నాగార్జున హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ సినిమాతో నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న అనుష్క, ఆ తరువాత కోడిరమకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో టైటిల్ రోల్ లో నటించి అత్యద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు, నటిగా ఎంతో గొప్ప పేరు గడించారు. ఆ తరువాత నుండి పలువురు నటుల సరసన హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూదుకెళ్లిన అనుష్క, ఇటీవల, టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల్లో నటించి మరింత గొప్ప పేరుని గడించారు.

ఇక ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పక్కా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం‘. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా రంగానికి ప్రవేశించి సక్సెస్ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా నిశ్శబ్దం మూవీ యూనిట్, ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించనుంది. అయితే ఈ వేడుక తాలూకు వెన్యూ, ఎవరెవరు అతిథులు వస్తున్నారు, తదితర విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా నిశ్శబ్దం సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here