`15-18-24 లవ్ స్టోరీ` మూవీ సెకండ్‌లుక్ విడుద‌ల.

0
615
15-18-24 Love story

ప్రేమ ప్రభావం వయసు మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `15-18-24లవ్ స్టోరీ`. మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ దేవాదుల‌(బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవ‌ల మెహ్రీన్ పిర్జాదా విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా లేటెస్ట్‌గా శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో 15-18-24- ల‌వ్‌స్టోరీ మూవీ పోస్టర్ ను ఎపి బీజేపీ ఆర్టిసన్ సెల్ స్టేట్ కన్వీనర్ శ్రీ బంగారుబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరు అయ్యారు .

ఈ సంద‌ర్భంగా ఎపి బీజేపీ ఆర్టిసన్ సెల్ స్టేట్ కన్వీనర్ బంగారుబాబు మాట్లాడుతూ – ప్రకాశం జిల్లా వాసి మాజేటి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ యూత్ గుండెలు కొల్లగొట్టే మంచి స్టోరీతో ముందుకొచ్చాడు. రాబోయే రోజుల్లో హిట్ దర్శకుల వరసలో చేరేందుకు ఈ చిత్రం అత‌నికి ఉపయోగ పడుతుందని నమ్ముతున్నాను. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి“ అన్నారు.

ఈసందర్భంగా దర్శకుడు మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – కథానుగుణంగా కులుంమనాలి, గోవా,ఒంగోలు, కేర‌ళ‌, హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని ప‌లు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. వైవిధ్యమైన కథా కథనాలతో సాగే ఈ చిత్రానికి ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల ఆ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించడం జరిగింది” అన్నారు.

నిఖిల్ (బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: రాజేష్ గుడి,
సంగీతం: జ‌య‌వ‌ర్ద‌న్‌, అంకే,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: హ‌జ‌ర‌త్ బాబు,
సహనిర్మాతలు: బి వి శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్,
నిర్మాతలు: స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్,
దర్శకత్వం:మాడుపూరి కిరణ్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here