సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. గతంలో ఆయన భరత్ అనే నేను, మహర్షి లతో రెండు వరుస హిట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు ఆయన ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకున్నారు.
సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ( 9 మిళియన్ల) కలిగిన ఏకైక నటుడిగా రికార్డు సాధించారు. 2010 ఏప్రిల్ లో ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన మహేష్ బాబు, అప్పటినుండి ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ విషయాలకు సంబందించిన అప్ డేట్స్ ని దాని ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక నేడు మహేష్ ఇంతటి అత్యద్భుత రికార్డు సొతం చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు….!!


