మోలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మరక్కార్’. 16వ శతాబ్దం నాటి కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్, ప్రభు, సునీల్ శెట్టి, అర్జున్, సుహాసిని, జై, మంజు వారియర్ తదితరులు ఇటీవల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.
“కలలు నిజం అయ్యాయి, మీ డ్రీం ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ నటుడు మోహన్ లాల్, కెమెరా మ్యాన్ తిరు తో పాటు ఆ సినిమా యూనిట్ సభ్యులకు గుడ్ లక్ చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!


