50వ ఏట అడుగిడుతున్న ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ : ‘రెబల్ స్టార్ ప్రభాస్’ తో నెక్స్ట్ మూవీ ప్రకటన….!!

0
722

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో సి అశ్వినిదత్ స్థాపించిన వైజయంతి మూవీస్ బ్యానర్ కూడా ఒకటి. 1974లో ఓ సీత కథ అనే సినిమాతో ప్రారంభం అయిన ఈ బ్యానర్ పై అక్కడి నుండి పలువురు నటీనటులతో సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ గొప్ప పేరు సంపాదించిన అశ్వినీదత్, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్లతో కలిసి మహర్షి సినిమాని నిర్మించి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకముందు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి సినిమా కూడా అత్యద్భుత విజయాన్ని అందుకుని ఆ బ్యానర్ వేల్యూ ని మరింత పెంచింది. ఇక ఆ సినిమాకు దర్శకత్వం వహించిన నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి సంస్థ 50 వ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా తమ తదుపరి సినిమాని రెబల్ స్టార్ ప్రభాస్ తో తీయనున్నట్లు కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్, తదుపరి వైజయంతి వారి సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెన్సేషనల్ ప్రకటనతో ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్లో ఎటువంటి సినిమా వస్తుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here