నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో శ్రేష్ఠ్ మూవీస్ ఫిల్మ్ ప్రారంభం

0
631

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్’కు ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రారంభ వేడుకలో సినిమా యూనిట్ కు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

నితిన్ ప్రస్తుతం ‘భీష్మ‘ సినిమా సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంత్
సమర్పణ: బి. మధు (ఠాగూర్ మధు)
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here