సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘A’ సర్టిఫికేట్ పొందిన “పలాస 1978”. మార్చ్ 6 న బ్రహ్మాండమైన విడుదల.

0
840

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ మెంబెర్స్ ప్రశంసలు పొందింది.

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ : ” సెన్సార్ బోర్డ్ ఎక్కువ కట్స్ సూచించడం తో రివైజ్ కమీటీ కి వెళ్ళాం. అక్కడ” పలాస 1978″ చూసిన బృందం ఈ సినిమా ను ప్రశంసించారు. వారికి నా ధన్య వాదాలు. ఇప్పటికే, ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారు ఇస్తున్న స్పందన నాకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలుగు సినిమా లలో “పలాస 1978″ భిన్న మైనది అని ఖచ్చితంగా చెప్పగలను. రైటర్ ఉన్న నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి థాంక్స్. ఈ సినిమా కు కథ నుండి రిలీజ్ వరకూ మాకు అండ గా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి చాలా థాంక్స్. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవడం చాలా ఆనందం గా ఉంది” అన్నారు.

విజయవాడ, గుంటూరు ల్లో జరిపిన ప్రమోషన్స్ టూర్స్ కి విశేష స్పందన వచ్చింది. రఘు కుంచె మ్యూజిక్ అందించడమే కాకుండా ఇక కీలక పాత్ర ను పోషించారు. శ్రీకాకుళం జానపదం నుండి తీసుకున్న’ నీ పక్కన పడ్డాదిరో చూడర పిల్లా..నాది నక్కీ లీసు గొలుసు’ పాట సోషల్ మీడియా లో విశేష ఆదరణ పొందుతుంది. ఈ సినిమా చూసి బాగా నచ్చి” మీడియా 9 మనోజ్” రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్స్ కి సొంతం చేసుకున్నారు.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. మార్చ్ 6 న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here