మైండ్ బ్లోయింగ్ యాక్షన్, డైలాగ్స్ తో అదరగొట్టిన మాస్ రాజా ‘క్రాక్’ టీజర్…..!!

0
718

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్సకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సముద్ర ఖని విలన్ గా నటిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా క్రాక్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ‘ఒంగోలు రాత్రి 8 అయిందంటే, ఖచ్చితంగా మర్డరే’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ప్రారంభం అయ్యే ఈ టీజర్ ఆద్యంతం మంచి యాక్షన్ సీన్స్, రవితేజ్ మార్క్ డైలాగ్స్, ఫైట్ సీన్స్ తో అదరగొట్టింది . ఇక ముఖ్యంగా  క్రాక్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లో ‘ఒరేయ్ అప్పిగా, సుబ్బిగా, నా టొప్పిగా’ అంటూ మాస్ స్టైల్ లో రవితేజ చెప్పే డైలాగ్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది.

రవితేజ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వేసవి కానుకగా మే 8న రిలీజ్ చేయనున్నారు….. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here