ఇళయదళపతి విజయ్ ”మాస్టర్” నుండి ‘కుట్టి స్టోరీ’ సాంగ్ రిలీజ్….!!

0
1305

కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్స్ క్రియేటర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా మూవీలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, అలానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇకపోతే నేడు ఈ సినిమా నుండి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘కుట్టి స్టోరీ’ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అరుణ్ రాజా కామరాజ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ని హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కలిసి ఎంతో బాగా ఆలపించారు. జీవితం చాలా చిన్నది, మనకు లైఫ్ లో కలిగే బాధలను, టెన్షన్స్ ను ప్రక్కన పెట్టి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి అనే కాన్సెప్ట్ తో మంచి జోష్ తో సాగె ఈ సాంగ్ కి యువత తో పాటు మాస్ ఆడియన్స్ ఎంతో కనెక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమా పై మరింతగా అంచనాలు పెరిగాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here