దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేయాలని భావించిన యూనిట్, ఆర్ఆర్ఆర్ సినిమా ని వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
‘ప్రేక్షకులకు ఇది కొంత డిజప్పాయింట్మెంట్ అయినప్పటికీ, వారికి మరింత బెస్ట్ గా మా సినిమాని అందించాలనే ఉద్దేశ్యంతో సినిమాని 2021 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు’ ఆర్ఆర్ఆర్ యూనిట్ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు….!!