డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉదయం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.
శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు!!
సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుందని చెప్పాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకొని కష్టపడి ప్రమోషన్ చేస్తారో… అలా శివ కూడా చాలా కష్టపడతాడు. దర్శకుడుగా సక్సెస్ కావడానికి ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ ఏంటో తెలుస్తోంది. ఈ కథను నమ్మి, రూపేష్ హీరోగా నటించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడనిపిస్తోంది. సలోనితో పాటు టీమ్ అందరు బాగా చేశారు. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్.అలాగే నాగార్జునగారు కొత్తవారిని ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుఉంటారు. టీజర్ చూసి ఆయన అంత మాట్లాడారు అంటే…రాజుగారిపై అభిమానం ఉన్నప్పటికీ టీజర్ ఆయనతో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన ఓ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నికల్‌గా బాగా చేశాడు. ఒక కథ రాసుకుని, ఇంత తక్కువ సమయంలో దాన్ని స్క్రీన్‌మీదకు తీసుకురావడం అంత సులువు కాదు. వి.వి.వినాయక్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు. కో-డైరెక్టర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వస్తుంది. ఆయన సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తారు. ఇలాంటి సీనియర్ దర్శకులతో పని చేసే అవకాశం శివకు వచ్చింది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్“ అన్నారు.
ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జగన్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివమీద వారికి ఉన్నప్రేమను, నమ్మకాన్ని తెలియజేస్తుంటే శివ చాలా అదృష్టవంతుడనిపిస్తోంది. ఇంతమంది పెద్దల అశీస్సులతో శివకు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఆదిత్యమ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ – “రాజుగారు, జయగారు మొదటి సినిమా నుంచి మమ్మల్ని ఆదరించి, వారి సినిమాల ఆడియో హక్కులను మాకే ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ పరంపరని అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివగారు డైరెక్టర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆడియో హక్కులను కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషం. శివగారికి జయగారితో సహ మా అందరి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.ఎ.రాజుగారు తోడుగా ఉన్నారు. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి. వీరి పరంపర ఇలాగే మాతోనే కొనసాగలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి మాకు సాధ్యమైనంత సహాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను“ అన్నారు.
కో డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ – `శివ ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఎంత గొప్పగా ఫీలయ్యామో, సినిమాను కూడా అంతే గొప్పగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ లొగొ లాంచ్ కార్యక్రమానికి మారుతిగారు వచ్చి వారి ఆశీస్సులు అందించారు. మళ్లీ ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం నెక్ట్స్ లెవల్ ఆనందంగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – “నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ తరఫున నాగార్జునగారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ప్రతిరోజూపండగే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ పండగను ఈ పండగకి తీసుకువచ్చారు. మా 22లో ఆ పండగ జరుగుతుంది. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెషల్ థ్యాంక్స్. ఆడియో విషయంలో ఆదిత్యమ్యూజిక్ మాధవ్‌గారు, నిరంజన్‌గారు చాలా సపోర్ట్ చేశారు. కమర్షియల్‌గాకూడా ప్రొత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్‌లాంచ్‌కి కూడా వారి సహకారం అందించారు. కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ – ఇక్కడికి వచ్చిన మారుతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు కంఫర్ట్‌జోన్‌కు విభిన్నమైన మంచి పాత్ర ఇచ్చిన శివగారికి థ్యాంక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. రూపేష్‌గారు బాగా నటించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ మాట్లాడుతూ -“ టీజర్ విడుదలచేసిన నాగార్జునగారికి, ఇక్కడికి వచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు“ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ – “సినిమా బాగా వచ్చింది. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు“ అన్నారు.
నటుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ – “టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పగలను“ అన్నారు.
నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – “ఎంతోమంది కొత్త దర్శకులను ప్రొత్సహించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన నాగార్జున చేతులు మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించాలని వారిని కలిశాను. మా అబ్బాయి..శివ ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండగానే నాగార్జునగారు తప్పక లాంచ్ చేస్తానని ప్రోత్సహించి టీజర్ రిలీజ్ చేసి ఆశీస్సులు అందించారు. అలాగే నాగచైతన్యగారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ మారుతి గారి దగ్గర శివ వర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండర్ లాంచ్ చేసినందుకు థాంక్స్. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావడం ఎంతో ఆనందం. శివ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెషల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్‌తో ఈ సినిమా ముందుకు వెళుతోంది.టీజర్ చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.“ అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.