”సరిలేరు నీకెవ్వరు” ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ సక్సెస్ పై సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రశంసలు…..!!

1
636

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు‘ మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి , సూపర్ హిట్ టాక్ తో అలానే అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు కురిపిస్తున్న ఈ సినిమా చాలా సెంటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ పై సూపర్ స్టార్ కృష్ణ గారు నేడు ఒక వీడియో బైట్ ద్వారా తన స్పందనను తెలియచేశారు.

ఆయన మాట్లాడుతూ, సరిలేరు నీకెవ్వరు ఇంత పెద్ద సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందని, అలానే సినిమా సక్సెస్ అయి పోస్టర్లపై బ్లాక్ బస్టర్ కా బాప్ అని హెడ్డింగ్ ఇవ్వడం చాలా బాగుందని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందనే నమ్మకం తనకు ఉందని, దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసిన ఈ సినిమాలో నటించిన హీరో సూపర్ స్టార్ మహేష్, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి లను కృష్ణ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here