యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ`. మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రమణ తేజ ఇంటర్వ్యూ..
మీ నేపథ్యం గురించి?
– మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. అక్కడే స్కూలింగ్ అంతా పూర్తయ్యింది. ఆ తరువాత తమిళనాడులో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తరువాత ఒక షార్ట్ ఫిలిం తీశాను. ఆ సినిమాకి నాకు స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని నెగటివ్ కామెంట్స్ రావడంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా స్క్రీన్ రైటింగ్ లోమాస్టర్స్ చేశాను.
ఈ ఇండస్ట్రీ లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
– మా ఇంట్లో అందరికీ సినిమా లంటే చాలా ఇష్టం. అందరూ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అలా ఒక సినిమాకి వెళ్లొచ్చిన తరువాత ఇంట్లో దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. అలాగే చిన్నప్పటి నుండి చిరంజీవి గారి అభిమానిని కావడంతో ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని, ఆయన వల్లే సినీ పరిశ్రమలోకి రావాలనే ఆశ కలిగింది. ఒక రకంగా చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్.
దర్శకుడు అవ్వాలనే ఇండస్ట్రీ కి వచ్చారు కదా! మీ దగ్గర కథలు లేవా?
– నాకు కథలు రాయడం పై అంత పట్టు లేదు. రాయగలనేమో కానీ చాలా సమయం పడుతుంది. కాకపోతే ఒక కథకు వెంటనే మంచి స్క్రీన్ ప్లే రాయగలను. ఒక సన్నివేశాన్ని ఎలా తీస్తే బాగుంటుంది అన్నది పర్ఫెక్ట్ గా చెప్పగలను. శౌర్య గారు రెండేళ్లు కష్టపడి మనసు పెట్టి ఈ కథను రాశారు. ఒక అద్భుతమైన కథ. నేను విన్నప్పుడే చాలా జెన్యూన్ గా అనిపించింది. అందుకే మా టీం అందరం మనసు పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాం.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం జిబ్రాన్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటి?
– ఈ సినిమా అవుట్ ఫుట్ చూశాక జిబ్రాన్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే జిబ్రాన్ బీజీఎమ్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్, ఆయనకు ఒకసారి కథచెప్పిన తరువాత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మ్యూజిక్ ఇస్తారు. అందుకే ఆయన గత చిత్రాలలో బీజీఎమ్ గొప్పగా ఉంటుంది. ఈ సినిమాకి శ్రీ చరణ్
పాకాల సాంగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి.
ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాల గురించి అంటున్నారు, ఇటీవల సంఘటనల ఆధారంగా తీశారా?
– అలా ఏమి కాదు, దిశా ఘటన జరగక ముందే ఈ కథను సిద్ధం చేశారు. ఈ సినిమా ఆ ఒక్క కోణంలోనే ఉండదు. ఆడవారి పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు, వారికి ఇవ్వాల్సిన గౌరవం లాంటి విషయాలు ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది.
మీకు నచ్చిన జోనర్ ఏమిటీ?
– డ్రామా నేను బాగా ఇష్టపడతాను. టాలీవుడ్ దర్శకులలో క్రిష్ గారంటే చాలా ఇష్టం. ఆయన తీసిన ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సినిమా తీయాలి అనేది నా కోరిక.
నాగ శౌర్యతో ట్రావెల్ చేయడం ఎలా ఉంది?
– నాగ శౌర్య సొంత అన్నయ్యలా నన్ను ప్రతి విషయంలో గైడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇప్పుడు కేవలం 26 సంవత్సరాలు ఆయన సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా తీయగలిగేవాడిని కాదు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ వారికి నా కృతజ్ఞతలు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.