ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధుని దర్శకురాలిగా పరిచయంచేస్తూ రాజ్ కందుకూరి నిర్మిస్తోన్న చిత్రం ‘చూసీ చూడంగానే`.వర్ష బొల్లమ్మ హీరోయిన్. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హీరో శివ కందుకూరి ఇంటర్వ్యూ.
హీరో అవ్వాలని ఎప్పడు అనుకున్నారు?
– ఎప్పటినుండో యాక్టర్ అవ్వాలనే ఇంట్రస్ట్ అయితే ఉంది. కానీ, నేను యాక్టింగ్ కి సూట్ అవుతానా అనే చిన్న డౌట్ ఉండేది. యూఎస్ లో చదువుకుంటున్నప్పుడు లాస్ట్ టు ఇయర్స్ లో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షన తీసుకున్నాను. అక్కడ నేను యాక్ట్ చేస్తోన్నప్పుడు నా యాక్టింగ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన చూశాక యాక్టింగ్ పై ఇంకా ఫ్యాషన్ పెరిగింది. అప్పుడే డిసైడ్ అయ్యాను యాక్టర్ గా ట్రై చెయ్యాలి.
ఫస్ట్ టైం మీ నాన్నగారితో యాక్టర్ అవుతానని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి?
– నాన్నగారు ఇండస్ట్రీ గురించి.. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని, అలాగే మనకు టాలెంట్ ఉన్న కొన్నిసార్లు మన సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కారణంగా కూడా ఫెయిల్ అవ్వొచ్చు. ఏ పని చేసినా… ఏ స్క్రిప్ట్ ఒప్పుకున్న అందులో పూర్తి నిజాయితీ ఉండేలా చూసుకోమన్నారు. ఈ సినిమాకి మేం అదే చేశాము.
నటుడిగా మీకు ఇన్స్‌పిరేషన్ ఎవరు?
– నాకు మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం. ఆయనే నాకు ఇన్స్‌పిరేషన్. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా సినిమా పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమచాలా గ్రేట్. ఆయన స్థాయి కాకపోయినా సినిమా బాగుంటే అది చిన్న సినిమా అయినా, ఆయన ఎంకరేజ్ చేస్తారు.
నిర్మాత కొడుకు అని మిమ్మల్ని ఈ సినిమాలో హీరోగా తీసుకోలేదని మీ నాన్నగారు చెప్పారు ?
– అవునండి. మా డాడీ ఇప్పటికే మంచి సినిమాలు చేశారు. ఆయన తల్చుకుంటే పెద్ద డైరెక్టర్ ద్వారా కూడా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యొచ్చు. కానీ ఆయన ఓన్లీ కథే హీరో, స్క్రిప్ట్ ఒక్కటే మెయిన్ అని నమ్మే వ్యక్తి. ఆయనకు ఈ స్క్రిప్ట్ నచ్చింది, నా కోసం ఆయన ఈ సినిమా చెయ్యలేదు. అయితే డైరెక్టర్ నేను ఈ సినిమాలో బాగా సూట్ అవుతానని నమ్మడం వల్ల నన్ను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. ఇక సినిమా చూశాక నాన్నగారు `ఒక డెబ్యూ యాక్టర్ చేసేదానికన్నా ఎక్కువగా చేశావు.. ఇలానే కష్టపడు మంచి భవిష్యత్ ఉంటుంది` అన్నారు
మీరు దాదాపు 12 రోజులు పాటు ఆడిషన్స్ చేశారట ?
– మా డైరెక్టర్ శేష్ సింధూ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో ఉన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. దాదాపు 12 రోజులు పాటు ఆడిషన్ తీసుకున్నారు. ప్రతి సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ రిహార్సల్స్ చేశాము.ప్రతి పది రోజులకొకసారి రషెస్ చెక్ చేసుకునే వాళ్లం. అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్ళే వాళ్లం
‘చూసీ చూడంగానే’ సినిమా గురించి ?
– ఏ లవ్ స్టోరీ తీసుకున్నా.. లైన్ వైజ్ గా ఒకేలా ఉంటాయి. అయితే ఈ సినిమాలో కొత్తదనం తీసుకురావడం కోసం పాత్రలతో పాటు వాటి నేపథ్యాన్ని కూడా కొత్తగా రాసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కామన్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ నే ఈ సినిమాలో ప్రధానాంశాలు. అవి కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతాయని నమ్మకం ఉంది. ఈ సినిమాలో నేను వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ గా కనిపిస్తాను. వర్ష బొల్లమ్మ ఒక డ్రమ్మర్ గా కనిపిస్తోంది. మా ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
మీ తదుపరి సినిమాలు?
– ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే కొత్త డైరెక్టర్ సృజనగారితో కూడా ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.