యంగ్ టీమ్ అంద‌రం క‌లిసి చేసిన ఒక జెన్యూన్ అటెంప్ట్ ‘అశ్వథ్థామ`. – యంగ్‌ హీరో నాగశౌర్య

0
673

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ`. మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంద‌ర్భంగా యంగ్ హీరో నాగశౌర్య ఇంట‌ర్వ్యూ..

ఫస్ట్ టైం `అశ్వ‌థ్థామ‌` లాంటి ఎమోషనల్ సినిమాతో రాబోతున్నారు క‌దా! ఎలా ఫీల్ అవుతున్నారు ?
– అవునండి. నా కెరీర్ లో ఇంత సీరియస్ అండ్ ఇంటెన్స్‌తో కూడిన ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు. సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాత్యాలకు సంబంధించిన సినిమా కాబట్టి అంత ఇంటెన్స్‌, ఎమోషనల్ ఉండాలి. అప్పుడే అంద‌రూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి సినిమాకు క‌నెక్ట్ అవుతారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అవుట్ ఫుట్ పట్ల మేము చాల సంతృప్తిగా ఉన్నాము. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా అని చెప్పారు క‌దా?
– నేను అంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం.. నేను ఈ సినిమా రాస్తున్న టైం నుండి ఇప్పటివరకూ పర్సన్స్ దగ్గర నుండి సినిమా బడ్జెట్ వరకూ చాలా విష‌యాలు మారాయి. కొంతమంది వెళ్లిపోయారు, ఇంకొంత మంది వచ్చి కలిశారు. చాలా విషయాల మీద పూర్తిగా అని చెప్ప‌ను కాని..కొంత‌ అవగాహన అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా రిజ‌ల్ట్ తేల‌క‌ముందే సినిమా పేరునుట్యాటూ గా వేయించుకోవ‌డం జ‌రిగింది.

మీరే ఈ కథ రాశారు క‌దా! మిగ‌తా పాత్ర‌ల‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు?
– ఎవ‌రు రాసిన స‌రే సినిమాలోఒకే క్యారెక్ట‌ర్ హైలెట్ గా ఉంటే అది విజ‌యం సాధించ‌దు. ముఖ్యంగా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. అందుకే ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఈ సినిమాకి అంద‌రూ కొత్త టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. రిస్క్ అనిపించిందా ?
– అలా ఏం లేదండీ! ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సాయి కొర్రపాటిగారు అవసరాల శ్రీనివాస్ గారే నాకు ఛాన్స్ ఇచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ లు రావాలి. టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసినవాడ్ని అవుతాను. అందుకే మా డైరెక్టర్, మా కెమెరామెన్ దగ్గర నుండి ఈ సినిమాకి పని చేసిన అందరూ కొత్తవాళ్లే.

మీ స్నేహితుడి లైఫ్‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్స్‌డెంట్ ఆధారంగా ఈ సినిమా క‌థ రాశారు క‌దా, అంత‌లా మిమ్మ‌ల్ని ప్ర‌భావితం చేసిన అంశం ఏంటి?
– అది ఇప్పుడే చెప్తే సినిమా చూస్తున్న‌ప్పుడు ఆ ఫీల్ ఉండ‌దు. కాక‌పోతే ఆ ఇన్స్‌డెంట్ న‌న్ను నిజంగా క‌దిలించింది. నిజంగా జ‌రిగింది అంటే కూడా మీరెవ్వ‌రూ న‌మ్మ‌రు. నేను వాళ్ళ ద‌గ్గ‌ర‌నుంది ప‌ర్మీష‌న్ తీసుకునే ఇలా కూడా జ‌రుగుతుంది అని మీకు చూపించ‌బోతున్నాను. అలాంటివి ప్ర‌తి రోజు ఒక కేస్ క‌నిపిస్తుంది. అందుకే కొంత మంది అమ్మాయిల‌కైనా ఇలా కూడా జ‌ర‌గొచ్చు కొంచెం జాగ్ర‌త్త తీసుకోండి అని కొంచెం క‌మ‌ర్షియ‌ల్ వేలో చెప్ప‌డం జ‌రిగింది. నాకు చెల్లులు లేదు కానీ ప్రతి సంవత్సరం నాకు రాఖీ కట్టే ప్రియ అనే అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అనుకొని
ఈ కథ రాశాను.

ఈ సినిమాని మీరే డైరెక్ట్ చెయ్యాలనిపించలేదా ?
– ఏమో అండీ డైరెక్షన్ చేద్దామనే ఆలోచన నాకు ఇప్పటివరకూ రాలేదు. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదు. షూట్ కి వెళ్లకముందే ప్రతి షాట్ గురించి ఎలా తీయాలి, ఏలెన్స్ వాడాలి అనేది మా టీమ్ అంద‌రం క‌లిసి డిస్కస్ చేశాం. డైరెక్షన్ కి సంబంధించి అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా ర‌మ‌ణ‌తేజ చూసుకున్నాడు. అంద‌రం క‌లిసి ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశాం అని భావిస్తున్నాము.

సాహో తర్వాత ఏం చెప్పి గిబ్రాన్ ని ఒప్పించారు?
– గిబ్రాన్ గారు చాలా మంచి వ్యక్తి. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అని గిబ్రాన్ గారి దగ్గరకు వెళ్లి కథ చెప్పడం జరిగింది. ఆయన ఒకటే శౌర్య కథ విన్నాను బాగా నచ్చింది కానీ సినిమా చూసి బ్యాక్ గ్రౌండ్ కొట్టాల లేదా అన్నది డిసైడ్ చేస్తాను అని చెప్పారు. సినిమా చూసి ‘వుయ్ హ్యావ్ ఏ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్’ అన్నారు. అంత ఎగ్జైట్ అయ్యి అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఆర్.ఆర్ ఇచ్చారు. గిబ్రాన్ గారు ఈ సినిమాకి మంచి అసెట్.

ట్రైలర్ చూస్తున్నప్పుడు కొంచెం ‘రాక్షసన్’ ఫీల్ వస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు కూడా వస్తుందా?
– తప్పకుండా వస్తుంది అయితే ‘రాక్షసన్’ మాత్రమే కాదు ‘ఖాకి’, ‘ఖైదీ’ లాంటి సినిమా చూస్తున్న ఫీల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలు కూడా ఒక జెన్యూన్ అటెంప్ట్స్ అందుకే అంత పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా ఒక్క విలన్ పాత్ర ఫిక్షనల్ తప్ప మిగతాదంతా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న జెన్యూన్ కథే.

మీకు మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. మీ జోనర్ సినిమాల్ని కాకుండా ఎందుకు కొత్త జోనర్ సినిమాల్ని ఎందుకు ట్రై చేస్తున్నారు ?
– ఇప్పటికే చాల లవ్ స్టోరీస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అదే పాత ప్రేమకథలు చేయయాలనిపించట్లేదు. దానికి అంటే కూడా నా కెరీర్‌లో నేను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించాలనుకుంటున్నాను. నటుడిగా నేను ఎదగాలని చేసిన ప్రయత్నం ఇది. `అశ్వ‌థ్థామ‌`తో నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను. ఒక డిఫ‌రెంట్ శౌర్య‌ని చూస్తారు. ఇప్ప‌టినుండి నాకు వ‌చ్చే క‌థ‌లు కూడా మార‌తాయ‌ని అనుకుంటున్నాను.

టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
– మహా భారతంలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించిన వ్యక్తి `అశ్వ‌థ్థామ‌`. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాంటిదే కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ‘గోపాల గోపాల’ సినిమాలో `అశ్వ‌థ్థామ‌` గురించి చెప్పే డైలాగ్, ఈ `అశ్వ‌థ్థామ‌` కి ఇన్స్ పిరేషన్. అందుకే శరత్ మరార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ డైలాగ్ వాయిస్ ఓవ‌ర్ సినిమా స్టార్టింగ్‌లో పెట్టడం జరిగింది.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ ?
– అవసరాల శ్రీ‌నివాస్ గారితో చేస్తున్న సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ అయిపోయాయి. అలాగే నందిని రెడ్డి గారు నా కోసం ఒక కొత్త‌ర‌కం ప్రేమ‌క‌థ రాస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వేరే హీరో సినిమా ఉంటుంది. దానికోసం ఓ లవ్ స్టోరీ నేనే రెడీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయితే వేరే హీరోని అప్రోచ్ అవుతా. ప్రస్తుతానికి అయితే `అశ్వ‌థ్థామ‌` రిలీజ్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here