‘అశ్వథ్థామ’ ఫుల్‌ గ్రిప్పింగ్ గా ఉండే ఒక ప‌ర్‌ఫెక్ట్ యాక్ష‌న్‌ థ్రిల్లర్ – హీరోయిన్ మెహరీన్.

0
1244

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అశ్వథ్థామ‘. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది. చిత్ర యూనిట్‌ ప్రమోషనల్‌ కార్య క్రమాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన మెహరీన్ ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడింది. ఆ వివ‌రాలు..

ఫుల్‌ గ్రిప్పింగ్ గా ఉండే ప‌ర్‌ఫెక్ట్ థ్రిల్లర్!!
* ‘అశ్వథ్థామ` అంటే చెడుకు వ్యతిరేకంగా నిలిచేవాడు. ఈ టైటిల్ కి సినిమాలో 100% జస్టిఫికేషన్ ఉంటుంది. ట్రైలర్ లో చూసిన మూమెంట్ప్‌ సినిమాలో చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. హీరో సిస్టర్ కి జరిగిన పెయిన్ ఫుల్ ఇన్సిడెంట్ తో హీరో జర్నీ బిగిన్ అవుతుంది. ‘అశ్వథ్థామ` కంప్లీట్ గా సీరియస్ సినిమా కామెడీ లేదు, కమెడియన్స్ కూడా ఉండరు. ఫుల్‌ గ్రిప్పింగ్ గా ఉండే ప‌ర్‌ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి మన క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే.

మనందరిలోనూ ‘అశ్వథ్థామ` ఉంటాడు!!
అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవ్వడం వల్ల సొల్యూషన్స్ వస్తాయని నేను అనుకోను. నా దృష్టిలో మనందరిలోనూ ‘అశ్వథ్థామ` ఉంటాడు. తనని మనందరం బయటికి తీసుకురావాలి. సినిమాలో విలన్ రోల్ ఫిక్షనల్ కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా పట్టించుకోకుండా ఉండే వాళ్ళంతా నా దృష్టిలో విలన్సేసినిమాలనేవి కేవలం మాధ్యమం మాత్రమే. మార్పు అనేది మనలో రావాలి.

నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారుతుంది!!
నాగశౌర్య ఫ్రెండ్ సర్కిల్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఈ సినిమా నాగశౌర్యకి చాలా ఇంపార్టెంట్. త‌ను ఈ సినిమాలో నటించాడు అంతవరకే. ఆ తరవాత స్టోరీ నేరేట్ చేయడం దగ్గరి నుండి డైరెక్షన్ అంతా ర‌మ‌ణ‌ తేజ గారే చూసుకున్నారు.. ఇందులో నాగశౌర్య ఇన్వాల్వ్ మెంట్ లేదు. ఈ సినిమా నాకైనా, నాగశౌర్య కైనా కొత్తే. ఇలాంటి సినిమాలు ఇద్దరిలో ఎవరూ చేయలేదు. నాగశౌర్య కి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారబోతుంది.

`అశ్వథ్థామ` కోసం ఈగ‌ర్‌గా వెయిట్‌చేస్తున్నాను!!
రీసెంట్ గా తమిళంలో నేను న‌టించిన‌ ‘పటాస్’, ఇక్కడ ‘ఎంత మంచివాడవురా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ప్ర‌స్తుతం తెలుగులో కొన్ని స్రిప్ట్స్ వింటున్నాను. ఇంకా ఏది ఫైన‌ల్ కాలేదు. ప్ర‌స్తుతం `అశ్వథ్థామ` రీలీజ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్‌చేస్తున్నాను. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here