‘సరిలేరు నీకెవ్వరు’ పై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రావు…..!!

0
592

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్, కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నేటితో రెండు వారలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్ ని రాబడుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు సినిమా సినిమా ప్రముఖులు సైతం మంచి ప్రశంశలు అందజేయగా, నేడు టాలీవుడ్ దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావు గారు ‘సరిలేరు నీకెవ్వరు’ పై ప్రశంసలు కురిపించడం జరిగింది.

సరిలేరు నీకెవ్వరు మూవీ దర్శకులైన అనిల్ రావిపూడి తో కలిసి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, అన్ని అంశాల మిళితంగా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడికి అలానే, తనలోని కామెడీ యాంగిల్ ని మరొక్కసారి స్క్రీన్ పై అదిరిపోయేలా ఆవిష్కరించి ఫ్యాన్స్ ని, అలానే ఆడియన్స్ ని అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా టాలీవుడ్ దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావు గారు  ‘సరిలేరు నీకెవ్వరు’ పై ప్రశంసలు అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం అనిల్, రాఘవేంద్ర రావు గారు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here