వందేళ్ళొచ్చినా సరే టాలీవుడ్ లో మాత్రమే నటిస్తాను : సూపర్ స్టార్ మహేష్

0
381

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా నీడ సినిమా ద్వారా టాలీవుడ్ కి బాలనటుడిగా అడుగుపెట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ వయసులోనే చేసిన అనేక సినిమాలతో ప్రేక్షకుల మనసులో మంచి పేరు సంపాదించారు. ఇక బాలనటుడిగా బాలచంద్రుడు సినిమా తరువాత కొంత విరామం తీసుకున్న మహేష్, ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ అందుకున్న మహేష్, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలు వినియోగించుకుని అనతికాలంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ గా విపరీతమైన క్రేజ్,

ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి తండ్రి కృష్ణ గారికి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించారు. అయితే కెరీర్ పరంగా ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించిన మహేష్ కు పలు మార్లు బాలీవుడ్ సహా, ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం తెలుగులోనే హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన తన 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తో మరొక సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమాలో మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ లో నటించి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మన్ననలు అందుకున్నారు.

ఇక నాలుగు రోజుల క్రితం కొందరు భారత జవాన్ లతో కలిసి సరిలేరు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్న ‘జైహింద్’ అనే ప్రత్యేక కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ, తనకు వందేళ్లు వచ్చినా సరే తాను మాత్రం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తానని, ఎప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీకి వెళ్లే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. నిజానికి గతంలో కూడా పలు మార్లు సూపర్ స్టార్ మహేష్ ఇదే విషయాన్ని పలు మార్లు చెప్పడం జరిగింది. ఇక సరిలేరు యూనిట్ పాల్గొన్న జైహింద్ ప్రోగ్రాం జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ప్రసారం కానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here